తిరుపతి జీవకోనలో 16 ఏళ్ల బాలికపై బ్లేడ్‌తో దాడి ఘటన కలకలం రేపింది. అంబేద్కర్ విగ్రహం సమీపంలోని ఓ బేకరీ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
దాడిలో గాయపడిన బాలికను స్థానికులు రక్షించి రుయా ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ బాలికపై యాసిడ్‌తో హత్యాయత్నం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
తాజా దాడికి కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#Tirupati #CrimeNews #BreakingNews #AndhraPradesh #DeshaTimes