DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 8:21 am Posted by : DESHA TIME

ఓటర్ల జాబితా సవరణ.. అన్‌మ్యాప్డ్‌ ఓటర్లకు నోటీసులు జారీ*

*ఓటర్ల జాబితా సవరణ.. అన్‌మ్యాప్డ్‌ ఓటర్లకు నోటీసులు జారీ*

 

2026 ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణలో భాగంగా, రాష్ట్రంలోని 32.36 లక్షల అన్‌మ్యాప్డ్ ఓటర్లతో పాటు, డేటాలో వ్యత్యాసాలున్న ఓటర్లకు ఈఆర్వోలు అక్టోబర్ 15లోగా దశలవారీగా నోటీసులు జారీ చేస్తున్నారు. 

 

తమ పేరిట నోటీసు జనరేట్ అయిందో లేదో ఈసీఐ పోర్టల్ (voters.eci.gov.in) సందర్శించి, ఎపిక్ కార్డు లేదా మొబైల్ సంఖ్య, ఓటీపీతో సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. 

 

నోటీసు వచ్చినట్లు తేలితే, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈసీ నిర్దేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఒకదానిని ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయవచ్చు లేదా స్థానిక బీఎల్‌ఓ/ఈఆర్వోలకు రాతపూర్వకంగా అందజేయవచ్చు.