ఆదిలాబాద్: ఉరేసుకున్న 5వ తరగతి బాలిక*

*ఆదిలాబాద్: ఉరేసుకున్న 5వ తరగతి బాలిక* గుడిహత్నూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన ప్రకారం. ఓ గ్రామానికి చెందిన బాలిక ADBలోని మైనార్టీ హాస్టల్లో 5వ తరగతి చదువుతోంది. రేషన్ కార్డు KYC కోసం పది రోజుల క్రితం ఇంటికి తీసుకురాగా.. హాస్టల్ వెళ్లనని బాలిక తేల్చిచెప్పింది. బంధువులతో కలిసి టీసీ తెచ్చేందుకు తల్లి వెళ్లగా.. అప్పటికే హాస్టల్ వారు టీసీ ఇవ్వరేమోననే భయంతో బాలిక ఉరివేసుకుని చనిపోయినట్లు తల్లి ఫిర్యాదులో పేర్కొంది.