DESHA TIMES
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 2:50 am Posted by : DESHA TIME

అమెరికాలో తల్లిని, తమ్ముడిని హత్య చేసిన భారత సంతతి యువకుడు

అమెరికాలో తల్లిని, తమ్ముడిని హత్య చేసిన భారత సంతతి యువకుడు

అమెరికాలోని మాసాచుసెట్స్‌లో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల అర్జున్ అరవింద్ తన తల్లి సుధా వెంకటేశన్, సోదరుడు సిద్ధార్థ్ అరవింద్‌లను దారుణంగా హత్య చేశాడు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హత్య చేసి తల్లి కారులో పరారైన అర్జున్‌ను పోలీసులు బుధవారం వేకువజామున వేలాండ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అర్జున్ చాట్‌జీపీటీలో తన కుటుంబాన్ని ఎలా చంపాలి, హత్యల తర్వాత ఎలా తప్పించుకోవాలి అనే దానిపై వెతికినట్లు విచారణలో తెలిసింది. ప్రస్తుతం అతడిపై పలు తీవ్రమైన కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.