మూఢనమ్మకానికి బలైన తల్లి.. కొడుకులే హంతకులు!
కరీంనగర్ జిల్లా | సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామంలో 80 ఏళ్ల వృద్ధురాలు నూనె వెంకటమ్మ బావిలో పడి మృతి చెందిన కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల దర్యాప్తులో ఆమె కుమారులు నూనె సమ్మయ్య, నూనె శ్రీనివాస్ ఆమెను బావిలో తోసి హత్య చేసినట్లు తేలింది. “ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఇల్లు వదిలేయాల్సి వస్తుంది” అనే మూఢనమ్మకంతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను హుజురాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. #Karimnagar #Telangana #CrimeNews...